ఏపీలో చర్చనీయాంశంగా మహిళకు కిడ్నీ మార్పిడి
మహిళను బతికించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
మూడు సార్లు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అరుదైన ఘటనగా చెబుతున్న వైద్యులు
మూడు సార్లు కుటుంబసభ్యులే కిడ్నీ దానం చేసిన వైనం
అక్షర కిరణం, (విజయవాడ): ఓ మహిళను బతికించుకోవడానికి ఇంట్లో వాళ్లంతా కిడ్నీ దానం చేశారు. రెండుసార్లు కుటుంబ సభ్యులు కిడ్నీలు దానం చేయగా.. ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు మూడోసారి కూడా కుటుంబ సభ్యులే కిడ్నీ దానం చేయబోతున్నారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అలాగే ఇలా కిడ్నీ మార్పిడి చికిత్స ఒకరికే మూడుసార్లు చేయడం చాలా అరుదు అంటున్నారు డాక్టర్లు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళకు ఫెయిల్ అయ్యింది. ఆమెకు రెండుసార్లు కిడ్నీ మార్పిడి సర్జరీ చేశారు. మహిళకు మొదటిసారి తల్లి కిడ్నీ ఇచ్చారు.. రెండోసారి భర్త కిడ్నీలు ఇచ్చారు. కానీ ఆ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి.
ఆ మహిళకు మూడోసారి కూడా కిడ్నీ మార్చాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఈసారి ఆ మహిళకు కిడ్నీ ఇచ్చేందుకు తండ్రి ముందుకు వచ్చారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్లు మూడోసారి ఆమెకు కిడ్నీ మార్పిడి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఒకే మహిళకు మూడుసార్లు కిడ్నీ మార్పిడి సర్జరీలు చేయడం చాలా అరుదు అంటుటున్నారు డాక్టర్లు. ఈ మేరకు ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్లు వివరాలను వెల్లడిరచారు. మహిళకు ఏకంగా మూడుసార్లు కిడ్నీ మార్పిడి చికిత్స చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు.
హైదరాబాద్‌లోనూ 30 ఏళ్లలో
మూడు సార్లుకిడ్నీ మార్పిడి చేశారు
హైదరాబాద్‌లో కూడా ఇలాంటి అరుదైన కిడ్నీ మార్పిడి జరిగింది. సఎన్ఎండీసీలో పనిచేసిన సాహు అనే వ్యక్తి 30 ఏళ్లలో మూడుసార్లు కిడ్ని మార్పిడి చేయించుకున్నారు. మరో రెండు నుంచి మూడేళ్లపాటు ఆస్పత్రిలో డయాలసిస్ ఇచ్చారు. మొదట సోదరుడు, రెండోసారి తల్లి ఆయనకు కిడ్నీ దానం చేశారు. తల్లి ఇచ్చిన కిడ్నీతో దాదాపు 11ఏళ్ల పాటు జీవనం సాగించారు. అదీ పాడవడంతో మరో రెండున్నరేళ్లపాటు డయాలసిస్ చేయించుకుంటూ జీవనం గడిపారు. మూడోసారి బయటి దాత నుంచి సేకరించి మార్పిడి చేశారు. ఆ కిడ్నీని అ మర్చి, రక్తనాళాలకు అనుసంధానం చేయడం వైద్యుల కు సవాల్‌గా మారినా.. ఎట్టకేలకు విజయవంతమైంది’ అని ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.