పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావు తనిఖీలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ .పి.జగదీశ్వరరావు కొబ్బరితోట, మౌలాలిపంజా, ప్రసాద్ గార్డెన్స్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి, ఓపీ, ఐపీ, సేవలు, డయా గ్నొస్టిక్ సేవలు, మందులు, వాక్సిన్ పోటేన్సి, ముఖ్యంగా ఎన్సీడీ 3.0 సర్వే గురించి ఎన్సీడీ 2.0 ఫాలో-అప్, ఆర్బీ ఎస్కే/ఆర్కేఎస్కే తదితర వాటి గురించి మెడికల్ అధికా రులకు సిబ్బంది అందరికి కాంప్రహెన్సివ్ స్క్రీనింగ్, రిఫరల్ సేవలు గురించి పూర్తిగా విశదీకరించారు. అభ ఐడీ మ్యాపింగ్ శతశాతం సాధించాలని వైధ్యాదికారులకు, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. తదుపరి వ్యాధి నిరోధక టీకాల గురించి వాక్సిన్ పోటేన్సి, టెంపరేచర్, రెగ్యులర్గా నోట్ చేసుకోవాలని సూచించారు. స్టాఫ్ నర్స్, సిబ్బంది షిఫ్ట్ డ్యూటీలు రెగ్యులర్గా చేయాలని, లేనిపక్షంలో సిబ్బందిపై చర్యలు తీసుకొంటామని ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవా లని, క్షేత్రస్థాయి సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్ విధిగా ఉపయోగించాలని తెలియచేశారు. ఈ సందర్శనలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, శ్రీ నాగభూషణం, ఎంపీహెచ్ఈవో పాల్గొన్నారు.