చోరీ కేసులో నిందితుడు అరెస్టు: చోరీ సొత్తు స్వాధీనం
అక్షర కిరణం, (విశాఖపట్నం): చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు ఏసీపీ ఏ వెంకటరావు తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఆయన వెల్లడిరచిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల ఆర్ హెచ్ కాలనీలో 18 తులాల బంగారం, 20 గ్రాముల వెండి చోరీ అయినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరామ్ ప్రాపర్టీస్‌లో ఈ చోరీ చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో ముగ్గురు వ్యక్తులను నిందితులుగా గుర్తించినట్టు ఏసీపీ తెలిపారు. వారిలో ఇద్దరిని గతంలోనే అరెస్ట్ చేశామని తెలిపారు. ఈక్రమంలో గర్భాన ఆనంద్ అనే మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేసినట్టు ఏసీపీ వెంకటరావు తెలిపారు. ఈచోరీకి సంబంధించి విచారణ వేగవంతం చేస్తున్నామని తెలిపారు. నేరస్థులపై తమ నిఘా ఎప్పుడు ఉంటుందన్నారు. సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులతో సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పీఎం పాలెం క్రైమ్ సీఐ ఎస్ఎస్ ప్రసాద్, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.